YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వైసీపీలోనే పోసాని యాక్టివ్...?

మళ్లీ వైసీపీలోనే పోసాని యాక్టివ్...?

కడప, ఏప్రిల్ 1, 
పోసాని కృష్ణ మురళి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. అయితే విడుదలయ్యారన్న మాటే కానీ వారంలో రెండు రోజులపాటు ఆయన సిఐడి కార్యాలయంలో సంతకం పెట్టాలి. విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో పోసాని కృష్ణ మురళి పై ఇప్పట్లో కేసులు ముగిసినట్లు కనిపించడం లేదు. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణమురళి చాలా నీరసంగా కనిపించారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి కన్నీటి పర్యాంతం అయ్యారు. అయితే తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయ మద్దతు లేనిదే తన కేసుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని కృష్ణ మురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో స్పందించేవారు. ఒకానొక దశలో ఆయన సాక్షిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమానికి హోస్ట్ గా కూడా సిద్ధపడ్డారు. అందుకు సంబంధించి ప్రమోషన్ వర్క్ కూడా జరిగింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు పోసాని. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చి చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కేసులకు భయపడి పోసాని అలా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఆయనపై వెనక్కి తగ్గలేదు. వరుసగా కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు దారుడుగా ఉండేవారు పోసాని కృష్ణ మురళి. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వాన్ని సమర్ధించారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు పోసాని కృష్ణ మురళి. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు కూడా. అయితే పిఆర్పి కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు. మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వాయిస్ను బలంగా వినిపించారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశమిచ్చారు జగన్. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది సినీ నటులు మద్దతు తెలిపిన.. పోసాని స్థాయిలో ఎవరికి కీలక పదవులు లభించలేదు.అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు పోసాని కృష్ణ మురళి. ఎవరైనా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే తిప్పికొట్టేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లోనే ఇవి వివాదానికి దారి తీసాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పోసానిపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చుట్టు కేసులు నడిచాయి. దాదాపు 26 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సి వచ్చింది. అయితే తాను దేనికి భయపడ్డారో.. అది జరిగిపోయింది. కేసులు కూడా ఎదురయ్యాయి. కనీసం ఈ కేసుల నుంచి బయటపడేందుకే నైనా రాజకీయ మద్దతు అవసరం. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Related Posts

To Top