YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంకా ఉంది...

ఇంకా ఉంది...

హైదరాబాద్, ఏప్రిల్ 1, 
వడపోత కంప్లీట్ అయింది. ప్రకటన రావడమే ఆలస్యం అన్నంత ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ ఎంపిక సైలెంట్‌మోడ్‌లోకి వెళ్లిపోయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి.. పొలిటికల్ పిక్చర్‌ను తలపిస్తోంది.ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలెక్షన్‌ కంప్లీట్ అయిందని.. ఏ క్షణమైనా కాషాయ రథసారధి ఎంపికపై ప్రకటన రావొచ్చని అందరు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్‌ ఇచ్చేలా ఉందట బీజేపీ అధిష్టానం. తెలంగాణ బీజేపీ చీఫ్‌ ఎంపిక విషయంలో ఆరునెలల పాటు సైలెంట్‌గా ఉండటమే బెటర్‌ ఆప్షన్‌గా భావిస్తుందట హైకమాండ్.తెలంగాణ బీజేపీ పెద్దల మౌనం వెనుక రీజన్‌ లేకపోలేదు. తెలంగాణ బీజేపీలో పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతలు, దూకుడుగా వ్యవహరించే లీడర్స్..ఇలా రకరకాల ఈక్వేషన్స్‌తో గ్రూపులు కట్టుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఫలానా క్వాలిటీస్ ఉన్నవారికే ఇవ్వాలని ఓ వర్గం చెబుతుంటే.. క్వాలిటీస్ కాదు సీనియారిటీ ఇంపార్టెంట్ అన్నది మరోవర్గం వాదనట.ఇలా నేతలు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో అసలేం జరుగుతోందో అర్ధంకాని డైలమాలో పడిపోయిందట బీజేపీ హైకమాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతల్ని అప్పగిస్తే.. మిగతా వర్గాలు అలకబూనడంతో పాటు అసంతృప్తి జ్వాలలు రగిల్చే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు ఆనుమానిస్తున్నారట.నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ ఆరు నెలలుగా కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రామచందర్ రావు లాంటి నేతల పేర్లను పరిశీలించారు. ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి మైలేజ్‌ వస్తుందోనని బీజేపీ హైకమాండ్ అభిప్రాయసేకరణ కూడా చేసింది. ఈ క్రమంలో పార్టీలో ఎక్కడా ఏకాభిప్రాయం లేదనే విషయం అధిష్టానికి స్పష్టంగా అర్థమైంది. కొత్తగా వచ్చినవారికి చీఫ్‌ బాధ్యతలు ఇవ్వకూడదని పాతవర్గం ఇప్పటికే అల్టిమేటం జారిచేసిందని సమాచారం.మరోవైపు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నావారు సైతం హైకమాండ్ ముందు రకరకాల కండీషన్స్ పెట్టారని తెలుస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ముందుగా పరిశీలించారట కమలం పెద్దలు. ఐతే తనకు తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే కేంద్ర మంత్రిపదవిని తొలగించవద్దని బండి సంజయ్ కండీషన్ పెట్టారని కమలం ఆఫీస్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి రెండు పదవులు ఇస్తే ఎలా అనే ఆలోచనలో పడిందట బీజేపీ హైకమాండ్.
ఇక మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరును సైతం పరిశీలించారు అధిష్టానం పెద్దలు. ఐతే తనను 2028 చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగించాలని ముందే చెప్పేశారట ఈటల. అందుకే ఈటల విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరికొందరి పేర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పరిశీలించినా మెజార్టీవర్గాల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడంతో వెనక్కి తగ్గిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇలా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందట. కాస్త టైమ్‌ తీసుకొని రథసారధిని ఎంపిక చేయడమే బెటర్ ఆప్షన్ అనుకుంటుందట బీజేపీ అధిష్టానం. మరికొన్నాళ్లు అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేసి, ప్రస్తుతం బీజేపీ చీఫ్‌గా ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే కొనసాగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని నియమించాలనే డెసిషన్‌కు వచ్చినట్లు సమాచారం. ఐతే అప్పటిలోగా తెలంగాణ బీజేపీలో ఉన్న గ్రూపులు, వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలనేది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.

Related Posts