
కాకినాడ
తెలంగాణ రాష్ట్రం బియ్యం ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేసింది. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదరగా.. ఇందులో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసే ట్రంగ్ ఎన్ నౌక కు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు నుంచి నౌకను జెండా ఊపి పంపించారు. తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం నౌక ద్వారా ఫిలిప్పీన్స్‌కు చేరనుంది.
తెలంగాణకు చెందిన బియ్యాన్ని కాకినాడకు తరలించి, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు రవాణా చేస్తున్నారు. తాజాగా ట్రంగ్ ఎన్ నౌక ద్వారా 12,500 టన్నుల ఎంటీయూ-1010 రకం బియ్యాన్ని ఎగుమతి చేశారు.
మొత్తం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంటీయూ-1010 దొడ్డు రకం బియ్యం కాగా, ఈ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ గత ఏడాది కోరింది. ఏమన్నా రోజుల ఇతర ఆఫ్రికా దేశాలతో చర్చలు జరుగుతున్నాయని తెలంగాణలో విస్తారంగా పడుతున్న ధాన్యాన్ని ఇతర దేశాలకు మార్కెట్ చేయటం జరుగుతుందని చేస్తున్నారు మంత్రి ప్రకటించారు.