
హైదరాబాద్
హైదరూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ భూములను పరిశీలించేందుకు వెళ్లనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. హెచ్సీయూ బయల్దేరిన ఎమ్మెల్యేలను, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తదితరులను అరెస్ట్ చేశారు.