
జామ్ నగర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకకు కాలినడకన వెళ్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 140 కిలోమీటర్లు. అనంత్ నిత్యం 20 కిలోమీటర్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడొద్దనే ఉద్దేశంతో భారీ సెక్యూరిటీ మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి అనంత ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.