YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి పొన్నం

సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి పొన్నం

సిద్దిపేట
 హుస్నాబాద్ మండలం పోతారం ఎస్, హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీ లోని రేషన్ దుకాణాల వద్ద రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసారు.
పొన్నం మాట్లాడుతూ దేశంలోనే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా. గ్యాస్ సబ్సిడీపై మహిళల ప్రశ్నకు సమాధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆలస్యం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల 263 రేషన్ దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని అన్నారు.
సన్న బియ్యం పంపిణీ అనేది ఎవరూ ఊహించనిది... పన్నులు వేయకుండానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నదని అన్నారు.

Related Posts