YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లక్ష్మీపార్వతికి హైకోర్టులో ఎదురుదెబ్బ

లక్ష్మీపార్వతికి హైకోర్టులో ఎదురుదెబ్బ

విజయవాడ, ఏప్రిల్ 1, 
వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బసవతారకం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని కోరుతూ 2009లో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. 1995 నవంబర్ 18న ఎన్టీ రామారావు రాసిన సప్లిమెంటరీ విల్లుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టు చట్ట ప్రకారం వ్యవహరించలేదని కోర్టు తెలిపింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు సరైన పద్ధతిలో వెళ్లలేదని హైకోర్టు స్పష్టం చేసింది. విల్లుపై సంతకం చేసిన సాక్షి జె. వెంకటసుబ్బయ్య వారసుడు జె.వి. ప్రసాద్‌రావును సాక్షిగా దిగువ కోర్టు గుర్తించింది. 2018లో దిగువ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా దీనిని హైకోర్టు కొట్టివేసింది.వెంకటసుబ్బయ్య, వై. తిరుపతిరావుకు సమన్లు ఇవ్వకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చెల్లదని హైకోర్టు తెలిపింది. వారు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. విల్లుపై సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్లు నోటి మాట ద్వారా తెలుసుకుని ఆయన కుమారుడు జె.వి. ప్రసాద్‌రావును సాక్షిగా గుర్తించడం సరికాదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది 1995లో రామారావు రాసినట్లు చెబుతున్న సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని లక్ష్మీపార్వతి 2009లో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. సప్లిమెంటరీ విల్లులో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రసాద్‌రావును సాక్షిగా గుర్తించాలని లక్ష్మీపార్వతి కోరారు. తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని.. అలాగే రామారావు విల్లు రాసిన విషయం నిజమేనని.. తన తండ్రి తనకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రసాద్‌రావు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో దిగువ కోర్టు ప్రసాద్‌రావును విచారించేందుకు అంగీకరించింది. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.

Related Posts