YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలోఅప్రకటిత ఎమెర్జెన్పీ ఏంటీ

తెలంగాణలోఅప్రకటిత ఎమెర్జెన్పీ ఏంటీ

హైదరాబాద్, ఏప్రిల్ 1, 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా, యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వెళ్తారేమోనని పోలీసులు కేటీఆర్ ఇంటికి చేరుకున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రజా హక్కులను హరిస్తూ, గళాన్ని వినిపించకుండా సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని కేటీఆర్ అన్నారు. అక్కడ ఎలాంటి సమస్య లేకపోతే ఎందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే.. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించినట్లు కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నెలలో ఒకసారి కాదు రెండుసార్లు HCU కి రాహుల్ గాంధీ వచ్చారు, అక్కడ ఆయనకు అన్ని రకాల భద్రత, రక్షణ కల్పించామని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన సైతం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరకు ప్రతిపక్ష నేతలను ఎందుకు అనుమతించడం లేదు. మమ్మల్ని బయటకు వెళ్లకుండా, హెచ్‌సీయూకు చేరకుండా అడ్డుకోవడానికి పోలీసులను మోహరించారు !! రాహుల్ గాంధీ గారు ఈ కపటత్వం ఎందుకు? నాటకాలు అవసరామ.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచానికి ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది? అని కాంగ్రెస్ అగ్రనేతను కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు
హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు - హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు ఇలా ఏదీ కాంగ్రెస్ ప్రభుత్వం వదలలేదు. నోరున్న జనంపైకి బుల్డోజర్ - నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్ దూసుకొస్తున్నాయి. మూసీలో, హైడ్రాలో మూటల వేట - ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట మొదలుపెట్టారు. పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస పడుతుంటే.. ఇక్కడ అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు చేస్తున్నాయి. చదువులు చెప్పే చోట విధ్వంసం దారునం. విలువగల భూములపై వికృత క్రీడ ప్రజలను పాలించే నాయకుడివా భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా? అప్పుడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు, ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు ప్రజలను హింసించే పాలన ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం జాగో తెలంగాణ జాగో! అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related Posts