YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొలిక్కి వస్తున్న ఫాస్టర్ ప్రవీణ్ కేసు

కొలిక్కి వస్తున్న ఫాస్టర్ ప్రవీణ్ కేసు

విజయవాడ, ఏప్రిల్ 1, 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాాల మృతికేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. మరో వైపు మీడియాలో వస్తున్న కథనాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తాజాగా వైన్ షాపు లో మద్యం కొన్నట్లు వస్తున్న వీడియో సోషల్ మీడిాయాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఉన్నది ప్రవీణ్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటి వరకూ ఈ వీడియోపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల రాజమండ్రిలో ఐజీ మీడియాతో మాట్లడుతూ విజయవాడలో ఓ నాలుగు గంటలపాటు ప్రవీణ్ ఎక్కడ ఉన్నారు అనేది క్లారీటీ రాలేదని, ఆ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తాజాగా విజయవాడలో ప్రవీణ్ ఓ మూడుగంటలపాటు గడిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై , విజయవాడ శివారులో ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్ పై నుండి ఒక్కసారిగా క్రింద పడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎసై స్పాట్ కు  వెళ్లి , ప్రవీణ్ ను ప్రక్కన కూర్చేబెట్టి , బైక్ రోడ్డు ప్రక్కన పార్క్ చేసినట్లుగా క్లారిటీ వచ్చింది. సుమారు సాయంత్రం 5.20నిమిషాల సమయంలో విజయవాడలో ప్రవీణ్ బైక్ స్వల్ప ప్రమాదానికి గురైనట్లు ఓ నిర్దారణకు వచ్చారు. ప్రమాద సమయంలో బైక్ హెడ్ లైట్ ఊడిపోవడంతోపాటు ప్రవీణ్ సైతం చాలా నీరసంగా కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రవీణ్ ను అక్కడే సమీపంలో ఓ పార్కులు కూర్చోబెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోమని సూచిండంతో వెంటనే రోడ్డుకు అనుకుని ఉన్నపార్క్ లో ప్రవీణ్ ఓ రెండున్నర గంటలపాటు సేదతీరారని చెబుతున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎసై సుబ్బారావు ,తాను తీసిన ఫొటోలను , ఆ సమయంలో బైక్ హెడ్ లైట్ పగిలిఉన్న కండీషన్ ను చూపించారు. ప్రవీణ్ బైక్ పై నుండి పడినప్పుడు చూసి, ఆయనతో మాట్లడిన ఇద్దరు ప్రత్యక్ష సాక్షులలో ఒకరు ట్రాఫిక్ ఎసై సుబ్బారావు, మరొకరు సమీపంలో టీ స్టాల్ నిర్వాహకుడు. తాాజాగా వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం ప్రవీణ్ బైక్ పై నుండి పడిపోవడంతోనే హెడ్ లైట్ ఊడిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై ,స్పందించి ప్రవీణ్ ను పైకి లేపి , బైక్ ప్రక్కకు పెట్టి మంచినీళ్లు ఇచ్చాడు. అప్పటికే కనీసం అడుగుతీసి అడుగువేయలేనంత నీరసంగా ప్రవీణ్ ఉన్నారు. ఇది గమనించిన ట్రాఫిక్ ఎసై , కాసేపు విశ్రాంతి తీసుకోవాలిని సూచిండంతో ప్రవీణ్ అక్కడే ఫుట్ పాత్ ను ఆనుకుని ఉన్న పార్క్ లో ఓ రెండున్నర గంటలపాటు నిద్రపోయారు. ఆ తరువాత లేచి, సమీపంలోని టీస్టాల్ వద్దకు వెళ్లారు. వీపరీతంగా తలనొప్పిగా ఉంది టీ కావాలని అడగడంతో టీస్టాల్ నిర్వాహుడు టీ ఇచ్చినట్లు చెెప్పాడు. అప్పటికే సమయం రాత్రి 8గంటలు కావొస్తోంది. హెడ్ లైట్ ఊడిపోవడం గమనించిన టీస్టాల్ నిర్వాహకుడు తాడుతో హెడ్ లైట్ కట్టే ప్రయత్నం చేసినప్పటికీ , ఫలితం లేదు. మీ కండీషన్ ఇలా ఉండి, హెడ్ లైట్ లేకుండా వెళ్లడం సేఫ్ కాదంటూ ట్రాఫిక్ ఎసైతోపాటు టీస్టాల్ నిర్వాహకుడు సైతం ప్రవీణ్ కు చెప్పారు. రాజమండ్రి దాటి వెళ్లాలి అని చెప్పడంతో హెడ్ లైట్ కట్టేందుకు వైర్ తీసుకురావడానికి టీస్టాల్ నిర్వాహకుడు వెళ్లగా, ఈలోపే ప్రవీణ్ బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ సమయంలో తాను తీసిన ఫొటోలను సైతం చూపించారు ట్రాఫిక్ ఎసై సుబ్బారు. ఇలా ఓ మూడు గంటలపాటు విజయవాడలో ప్రవీణ్ ఆగినట్లు తేలిపోయింది. విజయవాడలో ఆ నాలుగు గంటలు ఎక్కడున్నాడో్ విచారణ  చేపట్టామని గతంలో పోలీసులు చెప్పారు. ఇందులో ఓ మూడుగంటలు ఇలా గడిపినట్లు తేలిపోయింది. అయితే బైక్ పై నుండి పడిపోవడం, అప్పటికే విపరీతంగా నీరసంగా ఉండటానికి కారణాలు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కదల్లేని పరిస్దితిలో సైతం బైక్ నడుపుకుంటూ రాజమండ్రి బయలుదేరడం, ఆ తరువాత కొద్ది గంటల్లో మరణించడం జరిగింది. అయితే విజయవాడకు ముందు ప్రవీణ్ మరో గంట సమయం ఎక్కడ గడిపారు అనేది తేలితే ,కేసులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts