YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటి కొరత షూరూ...

నీటి కొరత షూరూ...

హైదరబాద్, ఏప్రిల్ 2, 
హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. నగర అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ.. దీని ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడింది. ఇటీవల జలమండలి జరిపిన ఒక సర్వేలో హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రమైన స్థాయిలో పడిపోవడం గుర్తించబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ 948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించిన సర్వేలో.. కేవలం 27 చదరపు కిలోమీటర్లలోనే జలమండలి సూచించిన స్థాయిలో జలాలు ఉన్నాయని.. మిగతా 921 చదరపు కిలోమీటర్లలో ఈ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు నిర్ధారించారుపరిణామం.. నగరంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలైన హైటెక్ సిటీ, మాదాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. జలమండలి చేసిన సర్వేలు ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దాదాపు లేనట్టుగా సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా.. IKEA చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడా భూమిలోకి రాకుండా సిమెంట్ పల్లాలు, ఇతర నిర్మాణాలు అడ్డుకుపోతున్నాయని గుర్తించారు.గత ఏడాది కంటే వర్షపాతం ఎక్కువ అయినప్పటికీ.. అందులోని నీరు ఎక్కువగా గ్రౌండ్‌వాటర్‌కు చేరకుండానే.. మూసీ నదిలోకి లేదా డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల వల్ల.. నగరంలోని ప్రజలు 11,000 ట్యాంకర్లను ప్రతిరోజూ తమ అవసరాల కొరకు బుక్ చేస్తున్నారు. 2024లో.. నగరంలో 586 వాటర్ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు 678 వాటర్ ట్యాంకర్లు వినియోగంలో ఉన్నాయి.ఈ పరిస్థితికి పరిష్కారం చూపడానికి జలమండలి 81 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కానీ ఈ డిమాండ్ పెరిగిపోవడంతో.. జలమండలి మరో 17 కొత్త స్టేషన్లను ప్రారంభించడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అగ్రనగరాలు.. హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, నిజాంపేట్, మాదాపూర్, ప్రగతి నగర్, మణికొండ, ఎస్సార్ నగర్ ప్రాంతాలు ఇప్పటికే అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల డిమాండ్‌ను ఎదుర్కొంటున్నాయి. పలు అపార్ట్మెంట్లలో బోర్లు పని చేయక.. వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితి.. పర్యావరణ రక్షణకు సంబంధించిన ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. జల వనరులను సురక్షితంగా కాపాడుకోవడం.. వాటి వినియోగాన్ని సక్రమంగా నిర్వహించడం.. తద్వారా భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించడానికి ప్రజలు , అధికారులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Posts