YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇది రాజ్యంగ వ్యతిరేక బిల్లు

ఇది రాజ్యంగ వ్యతిరేక బిల్లు

విజయవాడ
ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు.  ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర.   రాజ్యాంగ వ్యతిరేక బిల్లని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు.  దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంత మోడీ అజెండా.   పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవ్వాళ బ్లాక్ డే.   దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య.   ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదు.   వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగామని అన్నారు.
దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర.   వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా.  వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య.   వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోవడం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనం.   వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం,   వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్ళుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం,  300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్ లు అడగడం,   వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని.. - నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనని అన్నారు.
మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ,జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం.   ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగింది.   చంద్రబాబు  మోసం బయటపడింది.  ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి,   మరోపక్క పార్లమెంట్ లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం.   వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీచేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి.   ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

Related Posts