
నల్గోండ
నల్గొండ జిల్లాలో ప్రారంభమైన రేషన్ పంపిణీ కార్యక్రమం రాజకీయ రగడకు దారితీసింది.తాజాగా నల్గొండ జిల్లా కనగల్ మండలం,జి యడవెల్లి గ్రామం లో సన్న బియ్యం పంపిణీ ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.అయితే ఈ కార్యక్రమంలో ఎంపి కుందూరు రఘువీర్ రెడ్డిని అవమానించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.స్టేజి పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో అయన ఫోటో ప్రచురితం చేయకుండా అవమానాపరిచారని, ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని ఎంపి అనుచరులు మండిపడుతున్నారు.ఈ వ్యవహారం నల్గొండ జిల్లా రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నల్గొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మంత్రి మాట్లాడుతు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పిజి కనెక్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విబేదిస్తున్నాయి..గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను మంత్రి తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఇది సరికాదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డిని అవమానించడం కూడా రాజకీయంగా బిఆరెస్ నేతలు ఉపయోగించుకుంటున్నారు.ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ జిల్లాలో జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయట. ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో, ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.రానున్న రోజుల్లో నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది