
తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ దర్శనం సమయంలో ఆకాష్ అంబానీ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆకాష్ అంబానీ పూజరులతో కలిసి ఎస్‌వీ గోశాలకు చేరుకుని గోపూజ చేశారు. గోశాలలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.