
విశాఖపట్నం
విశాఖ మేయర్ పదవిని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలకు పోలీసులు పావులుగా మారుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా పోలీసులతో వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడానికి తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.అనంతరం కలెక్టరేట్ బయట గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్ల ఇళ్ళకు అర్ధరాత్రి సమయాల్లో వెళ్ళి మహిళలను బెదిరించడం దారుణమని అన్నారు.వైఎస్సార్‌సీపీ మేయర్‌పై తెలుగుదేశం పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టారని,ఎన్ని చేసినప్పటికీ వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని అన్నారు.