YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలో ప్రచారానికి హద్దే లేదా

సోషల్ మీడియాలో ప్రచారానికి హద్దే లేదా

రాజమండ్రి, ఏప్రిల్ 3, 
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ప్రస్తుత రాజకీయాలు. సోషల్ మీడియా జనరేషన్‌లో పాలిటిక్స్ మరింత దారుణంగా ఉంటున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ కేసులో ఎంత రచ్చ జరిగిందో అంతా చూస్తున్నారు. సీసీఫుటేజ్‌లో చిన్న అనుమానం కూడా లేదు. ప్రవీణ్ ఒంటిపై దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. కత్తి పోట్లు, దెబ్బలు, విష ప్రయోగం.. గట్రా ఎలాంటి డౌట్ లేదు. కానీ, చంపేశారు.. చంపేశారు.. అంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. సొసైటీలో మత చిచ్చు రగిల్చే ప్రయత్నం చేశారు కొందరు.ఈ తరహా ప్రచారం వెనుక ఓ పార్టీ ప్రోద్బలం ఉందనే ఆరోపణ ఉంది. ఆ పార్టీ అనుకూల వర్గీయుల నుంచే ఎక్కువగా రెచ్చగొట్టే పోస్టులు, కామెంట్లు వచ్చాయని పోలీసులు గుర్తించారు. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకూ సిద్ధమవుతున్నారు.చనిపోయింది పాస్టర్ కాబట్టి.. ఎలా చనిపోయారో తెలీటం లేదు కాబట్టి.. చంపేశారు అంటే సరిపోతుందా? సున్నితమైన అంశం కావడం తమకు కలిసి వస్తుందని అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు ఇంతలా రెచ్చగొట్టాలా? మతం రంగు పులిమేసి.. జనాల్లో విధ్వేషాన్ని రగిలిచ్చి ఏం చేయాలనుకున్నారు? ఆ వేడిలో రాజకీయ పబ్బం గడుపుకునే వ్యూహం పన్నారా? మరీ, ఇంతటి ప్రమాదకరమైన క్రీడ ఆడటం కరెక్టేనా?హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు.. దారి పొడవునా గంటల తరబడి సీసీకెమెరా ఫుటేజ్ దొరికింది కాబట్టి సరిపోయింది. లేదంటే పోలీసులు చెప్పిన విషయాల్ని అంత ఈజీగా ఎవరైనా నమ్మేవాళ్లా? పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడ చేరుకోవడం.. అక్కడ పార్కులో సేద తీరడం.. అప్పటికే ఆయన బుల్లెట్ బండి హెడ్‌లైట్ పగిలిపోయి ఉండటం.. చాలా నీరసించి ఉండటం.. ఆ తర్వాత దారి మధ్యలో లిక్కర్ కొనడం.. ఇలా మినిట్ టు మినిట్ కంప్లీట్ సీసీఫుటేజ్ బయటపెట్టారు ఏపీ పోలీసులు. అవన్నీ చూశాక కానీ.. ప్రవీణ్‌ది హత్య కాకపోవచ్చు.. యాక్సిడెంటో, అస్వస్థత వల్లో చనిపోయి ఉండొచ్చు అని ప్రజలు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు వస్తున్నారు. ఒకవేళ ఆ సీసీకెమెరా దృశ్యాలు లభించి ఉండకపోయి ఉంటే..? ప్రవీణ్‌ను చంపేశారని ప్రజలకు ఫిక్స్ చేసేవారే కదా? సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగి ఉండేదా? క్రిష్టియన్లకు మిగతా వర్గాలకు మధ్య చిచ్చు పెడితే.. రాష్ట్రం మతాల వారిగా విడిపోతే.. అది అందరికీ నష్టమే కానీ ఎవరికీ లాభం కాదు. చివరికి ఆ పార్టీకి కూడా. అందరికీ అన్ని వర్గాల మద్దతు కావాల్సిందేగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్‌ చూశాం. వివేకానందరెడ్డిని గొడ్డలితో అతి దారుణంగా తల నరికి చంపారు. ఆయన డెడ్‌బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ స్పాట్ చూస్తే చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు అది హత్య అని. కానీ, గుండెపోటు అని ప్రకటించి చావు తెలివితేటలు చూపించారు కొందరు. అలా కొన్నిగంటల సేపు మాత్రమే బుకాయించ గలిగారు. నిజం బయటకు రాకుండా సమాధి చేయలేక పోయారు. ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్లంతా ఇటీవల వరుసగా చనిపోతుండటం.. హత్యా రాజకీయాలు ఇంకా ఆపలేదనే అనుమానాన్ని బలపరుస్తోంది. వివేక కేసులో హత్యను గుండెపోటుగా చిత్రీకరిస్తే.. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి సెన్సిటివ్ కేసులో మర్డర్ ముసుగు వేసే ప్రయత్నం పక్కా ప్లాన్డ్‌గా జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశగా కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. అదే నిజమని తేలితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Related Posts

To Top