
హైదరాబాద్, ఏప్రిల్ 3,
కొన్నాళ్లుగా పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో ఏకంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కథానాయికగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు స్టార్ హీరోలక్ బెస్ట్ ఛాయిస్ గా మారింది. వరుస హిట్లతో జోష్ మీదున్న రష్మిక స్పీడ్‌కు సికందర్ సినిమా బ్రేక్ వేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆక్టటుకోలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు కూడా రావడం లేదు. కానీ ఈ మూవీతో మరోసారి నటిగా మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక… ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఏజ్ గురించి ఎగ్జైట్ అవుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది.తన పుట్టినరోజు గురించి చెబుతూ ఇన్ స్టాలో అందమైన సెల్ఫీ షేర్ చేసింది రష్మిక.. “ఇది నా పుట్టినరోజు నెల. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. పెద్దయ్యాక పుట్టినరోజు జరుపుకోవడం పట్ల ఆసక్తి తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. కానీ నా విషయంలో అది అలా కాదని స్పష్టంగా తెలుస్తుంది… నేను పెద్దయ్యాక నా పుట్టినరోజు జరుపుకోవడం పట్ల నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇప్పటికే 29 ఏళ్లు అని నమ్మలేకపోతున్నాను…ఈ సంవత్సరం ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా గడిపాను. ఇప్పుడు నా బర్త్ డే జరుపుకోవడం ఎంతో విలువైనది ” అంటూ రాసుకొచ్చింది.ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ తో కలిసి నటి రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.