YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

8.7 లక్షల కోట్ల ఆస్తులతో వక్ఫ్ బోర్డు

8.7 లక్షల కోట్ల ఆస్తులతో వక్ఫ్ బోర్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3, 
భారత్ లో అతి ఎక్కువ భూమి ఎవరి అధీనంలో ఉందో తెలుసా..? భారతీయ రైల్వే బోర్డు వద్ద..ఆ తర్వాతి స్థానం సాయుధ దళాలది.ఇక మూడో అతి పెద్ద భూస్వామిగా వక్ఫ్ బోర్డ్ ఉంది.వక్ఫ్ బోర్డ్ వద్ద మొత్తం 8.7 లక్షల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీటిలో 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. దీని మొత్తం విలువ రూ.1.2 లక్షల కోట్లు. అంత భారీ ఆస్తులున్న వక్ఫ్ బోర్డ్ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొస్తోంది. ఈ సవరణ విషయంలో ఇప్పుడు వివాదం నెలకొంది. సవరణ బిల్లు పార్లమెంట్ లో పాసవ్వడంతో వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు వస్తాయి.ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ చట్టాన్ని 1995లో రూపొందించారు. ఆ తర్వాత ఇప్పుడు సవరణ చేపట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు -2024 పార్లమెంట్ ముందుకొచ్చింది. సవరణ బిల్లు పాసయితే ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని ఆయా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు 1995 వక్ఫ్ చట్టంలో ఏముంది..ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానాన్ని, ఇచ్చే విరాళాన్ని వక్ఫ్ గా పరిగణిస్తారు. వక్ఫ్ ఆస్తులు భగవంతుడికి చెందుతాయని వారు నమ్ముతారు. ఢిల్లీ సుల్తానులనుంచి వక్ఫ్ సంప్రదాయం మొదలైంది. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు. వక్ఫ్ భూముల్ని.. మసీదులు, మదర్సాలు, షాదీమంజిల్ లు, అనాథ ఆశ్రమాలు, శ్మశాన వాటికలకోసం వినియోగిస్తున్నారు. అయితే వక్ఫ్ ఆస్తులు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయనేది ప్రధాన ఆరోపణ. వక్ఫ్ బోర్డ్ సమర్థంగా వాటిని నిర్వహించలేకపోవడం వల్లే అవి అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం సుమారు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉన్నాయి. 13వేల ఆస్తులపై కోర్టు కేసులున్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి తగిన సమాచారమే లేదు. సో.. ఇంత నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా అనేది ఎన్డీఏ ప్రభుత్వం వేస్తున్న ప్రశ్న. వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించేందుకు కొత్త చట్టం పనికొస్తుందని అంటున్నారు నేతలుప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డ్ లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని బోర్డులు వక్ఫ్ ఆస్తులని నిర్వహిస్తుంటాయి. అయితే కొత్త చట్టం అమలులోకి వస్తే బోర్డు సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలు ఉండేవారు. ఇకపై ఇద్దరు ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుల్లో ఇద్దరు ముస్లిం మహిళలు కూడా ఉండాలని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది. ఈ సవరణలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.వక్ఫ్ వివాదాలపై ఇప్పటి వరకు వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అంతిమం. కానీ ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఇచ్చారు. కొత్త చట్టంగా అమలులోకి వచ్చాక 6 నెలల లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్ లో విధిగా నమోదు చేయించాలి. ఇక వక్ఫ్ ఆస్తుల విషయంలో జిల్లా కలెక్టర్లకు కూడా అధికారాన్నిస్తోంది కొత్త బిల్లు.కొత్త బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతుందని, ఆ ఆస్తుల్ని క్రమక్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవి వట్టి అపోహలేనంటున్నారు కేంద్ర మంత్రులు. బిల్లుని సమగ్రంగా పరిశీలించాలంటున్నారు. ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులు ముస్లింలలో కొంతమంది పెద్దవారి చేతుల్లో ఉన్నాయని, వాటిని పేదవారి దగ్గరకు తెచ్చేందుకే ఈ బిల్లు అని అంటున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసి వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, అలాంటి పనులకు ఇప్పుడు చెక్ పెట్టినట్టవుతుందని కేంద్రం వాదిస్తోంది.వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న భూములను సరిగా వినియోగించుకుంటే వాటిపై ప్రతి ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేది సచార్ కమిటీ నివేదిక చెబుతోంది. కానీ ప్రస్తుతం కేవలం ఏడాదికి 200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోందట. తాజా సవరణ వల్ల ముస్లిం సమాజానికి భారీ నష్టం తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే, ప్రతిపక్షలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి.

Related Posts