YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జగిత్యాల లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ కవిత

జగిత్యాల లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ కవిత
ప్రతి ఒక్కరి మొహాల్లో చిరునవ్వు చూడాలని సిఎం కెసిఆర్  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.  జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం  గుట్రాజ్ పల్లి గ్రామంలో రూ.32 కోట్లు వ్యయం తో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్,  జూనియర్, డిగ్రీ కాలేజ్ భవనాలు నిర్మాణ పనులకు ఎంపి కవిత భూమిపూజ చేశారుఅనంతరం 
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి కవిత మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఘట్టాలు గుర్తుకు వస్తున్నాయని ఆమె అన్నారు.   గ్రామంలో 300 ఇల్లు  ఉండగా, 260మందికి.. ఇంటికో పెన్షన్ వస్తున్నా యని కవిత తెలిపారు.124 యాదవ కుటుంబాలు ఉండగా 63 కుటుంబాలకు గొర్రె పిల్లలు అందాయని చెప్పారు. రైతు బంధు పథకం కింద 80 రైతు కుటుంబాలకు రూ.4వేలు చొప్పున ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడిగా అందజేసింది అని కవిత గ్రామస్తులకు తెలిపారు. వ్యవసాయం కోసం కరెంట్ డిమాండ్ అధికంగా ఉందని రైతులు చెప్తున్న నేపధ్యంలో సబ్ స్టేషన్ ను మంజూరు చేయించు కుందామని  ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు. . లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు నిజామాబాద్ నుండి జగిత్యాల మీదుగా కరీంనగర్ కు వెళ్తుందని..ఈ రైలు సౌకర్యాన్ని ఉపయోగించు కోవాలని కవిత కోరారు.ఎంపి కవిత సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు కుల పెద్దలు, యువకులు టిఆర్ఎస్ లో చేరారు. వారందరికీ ఎంపి కవిత, డాక్టర్ సంజయ్ కుమార్ లు గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, జగిత్యాల నియోజక వర్గం టిఆర్ఎస్ ఇంచార్జీ డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె.చంద్రశేఖర్ రావు, జడ్పీటీసీ నాగలక్ష్మి, జగిత్యాల ఎఎంసి చైర్ పర్సన్ శీలం ప్రియాంక, గుట్రాజ్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి, బాలముకుందం పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Related Posts