YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫార్మా సీటికోసం సర్వే

ఫార్మా సీటికోసం సర్వే

యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూములను అధికారులు  సర్వే చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా శాంతియుతం గా నచ్చజెప్పి సేకరించిన భూములను సర్వే చేసి, ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 40 నుంచి 60 రోజుల్లోపు  సర్వే పూర్తి చేసేలా అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు.  యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో ఇద్దరు ఆర్ ఐలు, ఇద్దరు సర్వేయర్లు, మరో ఆరుగురు రెవెన్యూ, టీజీఐఐసీ సిబ్బంది సర్వేలో పాల్గొన నున్నారు. వీరే కాక ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనం త్రెడ్డితో పాటు ఏసీపీ కేపీవీ రాజు ఇతర ఉన్నతా ధికారుల బృందం సైతం సర్వే, ఫెన్సింగ్ వేసే విషయంలో భాగస్వాములు కానున్నారు. ఎలాంటి  అవాంచనీయా  సంఘటనలు కాకుండా పోలీసులు పెద్ద ఎత్తున  మొహరించారు.

Related Posts