YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్వీ యూనివర్సిటీ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ

ఎస్వీ యూనివర్సిటీ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ

తిరుపతి
ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేసారు.  పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిటిషన్ లపై ఎలా స్పందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిటిషన్స్ విచారించడంలో జాప్యం చేయవద్దన్నారు.  పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిటిషన్ పై  విచారించి త్వరితిగతిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషను లోని వివిధ కేసులు సంబంధించి వాటి  స్టేటస్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు.  పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారనిఅడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు నిమిత్తం ఎక్కడకు వెళ్ళిన వారికి తప్పనిసరిగా డ్యూటీ పాస్ పోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.    ఈ కార్యక్రమంలో  కే రవి మనోహర్ ఆచారి అదనపు ఎస్పీ శాంతి భద్రతలు, లత డిఎస్పి మహిళ మరియు తిరుపతి టౌన్,  సుబ్రహ్మణ్యం సి. ఐ.డి.సి.ఆర్. బి,  సాధిక్ ఆలి సీ.ఐ. స్పెషల్ బ్రాంచ్  రామయ్య సిఐ  ఎస్వియు పి.ఎస్. మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts