
అమరావతి
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.
రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా . విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాల పై భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు.