YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ మాస్టర్ ప్లాన్ రెడీ

కరీంనగర్ మాస్టర్ ప్లాన్ రెడీ

కరీంనగర్, ఏప్రిల్ 4, 
కరీంనగర్‌ పట్టణంతో పాటు పరిసరాల్లో ఉన్న 62 గ్రామాల పరిధిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) రూపొందించిన మాస్టర్ ప్లాన్-2041ను అధికారులు సిద్ధం చేశారు.అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ ఆండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎఫ్) మార్గదర్శ కాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. మాస్టర్ పై ఏమైనా అభ్యంతరాలుంటే 90 రోజుల్లో తెలియజేయవచ్చని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో సుడా చైర్మ న్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. దీనిపై స్థానికంగా పలువురు తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారుప్రస్తుతం అమలులో ఉన్న సుడా మాస్టర్ ప్లాన్-2019ను అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త సరిహద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం సుడా పరిధి తూర్పున తాహెర్ కొండాపూర్, ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లభూత్కూర్, ముగ్దుంపూర్ చేగుర్తి. లింగాపూర్, అన్నారం, ఈడులగట్టెపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెంజర్ల సరిహద్దు వరకు ఉంటుంది.పడమర వైపు గునుకుల కొండాపూర్ సరిహద్దు నైరుతి మూల నుంచి మొదలై ఉత్తరం దిక్కువెళ్తూ జంగపల్లి, మాదాపూర్, కాశీంపేట, పారువెల్ల, కాజీపూర్, ఒద్యారం. నాగులమాల్యాల, వెలిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయువ్య మూల వరకు మాస్టర్ బౌండరీగా నిర్ధారించారు.దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడమర వైపునకు వెళ్తూ మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తప ల్లి (పీఎన్), రేణికుంట, గునుకుల కొండాపూర్, సరిహద్దు నైరుతి మూల వరకు హద్దులుగా నిర్ణ యించారు. ఉత్తరాన కిష్టాపూర్ సరిహద్దు, దేశారాజ్ పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట చాకుంట, చామనపల్లి తాహేర్ కొండాపూర్ ఈశాన్యం మూల వరకు సరిహద్దుగా ఉంది.వాణిజ్యం, మిశ్రమ, పరిశ్రమల జోన్లు కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి.అందుకే నగరంలోని ప్రధాన రహదారులను వాణిజ్య జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. నివాసప్రాం తాలు, వాణిజ్య కేంద్రాలు కలిసి ఉన్న ఏరియాలను మిశ్రమజోన్లుగా ప్రతిపాదించారు. కరీంనగర్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండ స్ట్రీయల్ జోన్లను మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించారు. 2.289 హెక్టార్లలో ఇండస్ట్రీయల్ జోన్ గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్ నగర్, ఒద్యారం, నాగులమల్యాల (కొంతభాగం), చెంజర్ల(కొంత భాగం), ఎలగందల్(కొంత భాగం), బద్ధిపల్లి(కొంత భాగం) రానున్నాయి.కరీంనగర్ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించామని సుడా చైర్మెన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. సుమారు 30ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతోందని నగరం చాలా విస్తరించిన నేపద్యంలో రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు.నగరం ఇంకా చాలా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపద్యంలో పాత సుడా పరిధి యూనిట్ గా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యిందని చెప్పారు. దీంతో ఒక ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరుగుతుందని, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ కమర్షియల్, సెమీ రెసిన్షియల్ గా గుర్తించి వాటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచామని తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో కరీంనగర్ కు రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇది సుమారు 20 గ్రామాల సరిహద్దుల మీదుగా పోనుంది. 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మిస్తారు. కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతూ ఓఆర్ఆర్ లో ఒక భాగం గనుకుల కొండాపూర్, జంగపల్లి, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగుల మల్యాల, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా వెళ్లి కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిని కలుస్తుంది.కొత్తపల్లి పట్టణం దాటిన తర్వాత కరీంనగర్- జగిత్యాల రహదారి నుంచి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడు, బొమ్మకల్ గ్రామ శివారు నుంచి మానేరు నది మీదుగా మానకొండూరు, ముంజంపల్లి పోరండ్ల, నుస్తులాపూర్ వద్ద రాజీవ్ రహదారితో కలుస్తుం ది. హైదరాబాద్ ను కలిపే కొత్తపల్లి- మనో హరాబాద్ రైల్వేలైన్ పూర్తయితే నగరం కనెక్టివిటీ మరింత విస్తారంగా మారుతుంది.

Related Posts