YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ చిల్లీకి జియో గుర్తింపు

వరంగల్ చిల్లీకి జియో గుర్తింపు

వరంగల్, ఏప్రిల్ 4, 
వరంగల్‌ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఈ మేరకు భౌగోళిక గుర్తింపు సంస్థ (జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ) సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి 18వ ఉత్పత్తిగా చపాటా మిర్చి జీఐ ట్యాగ్ పొందినట్లయ్యింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘంతో పాటు మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీకొండా లక్ష్మన్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది.2022లోనే చెన్నైలోని ఇండియన్ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేశారు. దీంతో దాదాపు మూడేళ్లకు టపాట మిర్చికి ఆ సంస్థ జీఐ ట్యాగ్ సర్టిఫికేట్ జారీ చేయగా.. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.చపాట మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. చపాట మిర్చి టమాట ఎరుపు రంగులో ఉండి, తక్కువ కారంతో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో ఒలియోరెసిన్ ( మిరప నుంచి తీసే నూనే) కంటెంట్ 6.37 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉండి ఘాటు తక్కువగా ఉంటుంది.ఈ ఆయిల్ ను ఇంటర్నేషనల్ ఫుడ్స్ తోపాటు ఖరీదైన స్వీట్లు, కాస్మోటిక్స్, వివిధ రకాల డ్రింక్స్, మెడిసిన్ తయారీలో దీనిని వినియోగిస్తున్నారు. దీంతోనే చైనా, యూకే, యూఎస్, జర్మనీతో పాటు ఇరత యూరోపియన్ కంట్రీల్లో మంచి డిమాండ్ ఉంది.ఈ చపాటా మిర్చి ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నడికూడ మండలంలోనే ఎక్కువగా సాగయ్యేది. అక్కడి రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసి ఇతర ప్రాంతాల రైతులకు అందించడంతో ఉమ్మడి వరంగల్ తో పాటు కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటం, బహిరంగ మార్కెట్ లో డిమాండ్ కూడా బాగానే ఉండటంతో రైతులు చాలావరకు చపాటా వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా వరంగల్ జిల్లా దుగ్గొండ మండలంలోని తిమ్మంపేట రైతు ఉత్పత్తిదారుల సంఘంతో ఈ చపాటా మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కినట్లయ్యింది.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో దాదాపు 300 మంది రైతులు తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. గ్రామంలో పండించిన మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు జీఐ ట్యాగ్ తో చపాటా మిర్చికి మరింత డిమాండ్ పెరగనుంది. ఫలితంగా రైతులకు కూడా మరింత లబ్ధి చేకూరనుంది.ప్రస్తుతం హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో దాదాపు 20 వేల మంది రైతులు చపాటా మిర్చి 6,738 ఎకరాలకుపైగా సాగు చేస్తుండగా.. తిమ్మంపేట రైతుల కృషితో ఈ చపాటా మిర్చికి మంచి గుర్తింపు దక్కినట్లయ్యింది. దీంతో రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగినట్లయ్యింది.బహిరంగ మార్కెట్ లో ప్రస్తుతం చపాటా మిర్చి ధర కిలో రూ.300 వరకు ఉంది. జీఐ ట్యాగ్‌ వల్ల కిలోకు రూ.450 నుంచి రూ.500 వరకు ధర లభించనుంది. అంతేగాకుండా రైతులు తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం కలగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Related Posts