YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రామానాయుడు స్టూడియో స్వాధీనం...

రామానాయుడు స్టూడియో స్వాధీనం...

విశాఖపట్టణం, ఏప్రిల్ 4, 
విశాఖ రామానాయుడు స్టూడియో భూములను రియల్ ఎస్టేట్ కు ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.   విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాలల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైఎస్ హయాంలో 34.44 ఎకరాలను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే అందులో అంతటా స్టూడియో నిర్మించలేదు. నిబంధనల ప్రకారం ఇతర అవసరాలకు ఆ భూమిని ఉపయోగించకూడదు. వినియోగిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అయితే రామానాయుడు స్టూడియో యాజమాన్యం అందులోని 15.17  ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు 2023లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్నారు.   ఇది నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో  రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..  రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించారు. వారు ఇచ్చే వివరణ తర్వాత భూములను వెనక్కి తీసుకుంటూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉది.  ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా స్టూడియో నిర్మించిన భూమిపైనా నియంత్రణ ఉంచాలని భావించే అవకాశం ఉంది. సినీ అవసరాలకు తప్ప దేనికి ఉపయోగించినా ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంటారు. మరో వైపు విశాఖ రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఈ అంశంపై కేబినెట్ భేటీలోనూ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ భవనం నిరుపయోగంగా ఉంటోందని నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో చంద్రబాబునాయుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై పరిశీలన చేయాల్సి ఉందన్నారు. మంత్రులు అంతా.. రుషికొండ ప్యాలెస్ ను చూసి రావాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో సలహాలివ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది.       టూరిజం కాటేజ్ ఉండే ప్రాంతాన్ని కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్ ను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. స్టార్ హోటల్ అని చెప్పినప్పటికీ అందులో గట్టిగా ఐదు బిల్డింగులో ఒక్కో దానిలో  మూడు, నాలుగు బెడ్ రూములు మాత్రమే ఉన్నాయి. హోటల్  గదులు కట్టినట్లుగా కట్టలేదు.  కనీసం కాటేజీలు కట్టినట్లుగా కట్టలేదు. జగన్ మోహన్ రెడ్డి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని విశాఖ నుంచి పరిపాలించడానికి ప్రజాధనంతో ఆ నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ విధ్వంసం చేసినట్లుగా ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వానికి కూడా సవాల్ గా మారింది.

Related Posts