YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నటుడు మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి

నటుడు మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి

అమరావతి
ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు  మనోజ్ కుమార్ గారు మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ అన్నారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మనోజ్ కుమార్  భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తను రూపొందించిన చిత్రాల్లో జాతీయ భావాలను ప్రస్ఫుటంగా... ప్రేక్షకుల మనసుల్ని హత్తుకొనేలా చూపించారు. ‘ఉపకార్’ చిత్రం ఈ రోజు చూసినా – నాటి ‘జై జవాన్ జై కిసాన్’ నినాద నేపథ్యం, ప్రభావం తెలుస్తాయి. రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాలు కూడా అయిదు దశాబ్దాలకు పూర్వం ఉన్న మన సమాజ పరిస్థితులకు అద్దంపడతాయి. దేశం అంటే ప్రేమాభిమానాలు కలిగిన నటుడు, దర్శకుడు అయన. ఆ భావాలే ఆయనకు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.  మనోజ్ కుమార్  కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు.

Related Posts