
విజయవాడ
రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బీజేపీ గత 10 ఏళ్లుగా మోసం చేస్తుంది. ప్రత్యేక హోదా ఏపీ కి అతి ముఖ్యమైనది. 2014 లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. పోలవరం మొత్తం కేంద్రమే కడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కదానికి దిక్కులేదని ఏసీపీపీ ఛీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు.
హోదా తో పాటు రాష్ట్రానికి పోలవరం అంతే ముఖ్యం. పోలవరం ఆంధ్ర జీవనాడి. రైతులకు ఊపిరి. ఇవ్వాళ్టి వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీనికి భాధ్యత ఎవరు? పోలవరం వైఎస్సార్ కల. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని అనుమతులు తీసుకు వచ్చి పనులు ప్రారంభించారని అన్నారు.
2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టు గా గుర్తించింది. 2019 లో అధికారంలో వచ్చిన బాబు కేవలం 17 శాతం పనులు చేశారు. ప్రాజెక్ట్ అంచనా ను అమాంతం పెంచారు. 50 వేల కోట్లకు పెంచేశారు.జగన్ అధికారం లో వచ్చాకా పోలవరం పనులు 3 శాతం దాటలేదు. తండ్రి ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకు వెళ్ళలేదని అన్నారు.
ఇప్పుడు బీజేపీ పోలవరం పై గేమ్ ఆడుతుంది. చంద్రబాబు మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ కి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు పగలు పడిన గోతిలో రాత్రి పడ్డారు. అందరు కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారు. జగన్ ,బాబు ఇద్దరు బీజేపీ కి లొంగిపోయారు. ప్రాజెక్ట్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 నుంచి 41 మీటర్ల కు కుదించారు. 41 మీటర్ల ఎత్తులో మాత్రమే ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు.
41.15 ఎత్తులో నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్ సైట్ లో పెడితే...ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రాజెక్ట్ బ్యారేజ్ గా...లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలి పోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర. ఈ కుట్రలో భాగం బాబు,జగన్,పవన్. 41 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగితే 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందదు. 41 మీటర్ల ఎత్తులో కూడా ప్రయోజనాలు తగ్గవు అనేది కూటమి చెప్తున్నది అబద్ధం. ఫేజ్ 1 లో ఎన్ని ఎకరాలు... ఫేజ్ 2 లో ఎన్ని ఎకరాలు.. కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.