YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనిల్ యాదవ్ గాయబ్

అనిల్ యాదవ్ గాయబ్

నెల్లూరు, ఏప్రిల్ 5, 
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఎక్కడా..? వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న నేత ఎప్పుడెందుకు సైలెంట్ అయ్యారు. పార్టీకి దూరంగా ఉంటున్నారా.. క్యాడర్‌కి కటీఫ్‌ చెప్పేశారా. నో పాలిటిక్స్.. ఓన్లీ బిజినెస్‌ అంటూ అనిల్ తిరుగుతున్నారనే గాపిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. పార్టీలో నెంబర్-2 గా వ్యవహరించిన వారు సైతం పక్కకు తప్పుకున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ అనే క్వశ్చన్‌ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది.మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అంటే ఫైర్ బ్రాండ్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మైక్ పట్టుకుంటే అంతే సంగతీ.. ఆయన అగ్రెసివ్‌నెస్‌కి సపరేట్ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. ఎవరైనా తమ పార్టీ అధినేత జగన్‌ను విమర్శిస్తే.. అనిల్‌కుమార్ యాదవ్ మైకాసురుడైపోయేవాడు. అనిల్‌ వరుస కౌంటర్లతో రాజకీయాన్ని హీటు పుట్టించేవారు. కానీ ఇప్పుడు అనిల్‌ అడ్రెస్‌ కూడా తెలియడం లేదనే గాసిప్స్ నెల్లూరు పాలిటిక్స్‌లోచక్కర్లు కొడుతున్నాయి.వైసీపీ అధినేత జగన్‌కు వీర విధేయుడుగా పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్.. అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్‌గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో ఆ స్థానానికి జరిగిన బైఎలెక్షన్‌లో పోటీ చేసి విజయం సాధించారు అనిల్. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019లలో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ తరఫున నెగ్గిన అనిల్ కుమార్ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తోనే పార్టీలో పలుకుబడి సాధించారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీ లోపలా బయటా వైసీపీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు. ఇక 2019లో ఆయనకు జగన్ మార్క్ సామాజిక సమీకరణలతో మంత్రి పదవి దక్కింది. అనిల్‌ కుమార్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కొందరు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు దూరంగా ఉండేవారు. దీంతో రెడ్ల ఎమ్మెల్యేలు, అనిల్‌ మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయనకు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత అనిల్ కుమార్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి జిల్లాలో పార్టీ నేతలు.. అనిల్‌కు మధ్య అంతరం మరింత తీవ్రమైందిఈ సమయంలో జిల్లాలో తెల్లరాయి తవ్వకాలు.. అమ్మకాలకు సంబంధించి అనిల్‌కు బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ నేతలు… పార్టీ అధిష్టానం దగ్గర తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారట. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్‌ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేటకు షిఫ్ట్ చేశారు. దీంతో అనిల్‌ను జిల్లా నుంచి పంపించేశామని…అప్పట్లో కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అయిష్టంగానే అనిల్‌ ఎంపీగా పోటీ చేసినట్లు ప్రచారం ఉంది. అందుకే ఓడిపోవడంతో పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు నెల్లూరులో గుసగుసలు వినిపిస్తుంటాయి.అనిల్‌ కుమార్ యాదవ్ నరసరావుపేటకు షిఫ్ట్ అయినా.. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సీటును మాత్రం తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్‌ ఇప్పించుకున్నారు. ఈ నిర్ణయంపై అప్పటి వైసీపీ నేత… వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ తర్వాత అనిల్ ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోవడంతో ఆయన సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆయన ప్లేస్‌లో నెల్లూరు సిటీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది పార్టీ హైకమాండ్. అనిల్‌ కుమార్ యాదవ్ టచ్‌లోకి రాకపోవడంతో ఆయన వర్గీయులంతా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డితోనే ఉంటున్నారు.ప్రస్తుతం అనిల్‌కుమార్ యాదవ్‌ తన బిజినెస్‌లను చూసుకుంటున్నారట. అప్పుడప్పుడు నెల్లూరు సిటీకి వస్తున్న అనిల్.. అత్యంత సన్నిహితులనే కలుస్తున్నారట. తన రాజకీయ విరామమం టెంపరరీ మాత్రమేనని సన్నిహితులకు చెప్పి వెళ్తున్నారట అనిల్. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి చేపట్టే కార్యక్రమాల్లోనే మెరుస్తున్నారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనిల్ భవిష్యత్‌లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Related Posts