
రాజమండ్రి, ఏప్రిల్ 5,
మాట తూటా లాంటిది. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. కొన్ని మాటలు జీవితం మీద కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ప్రస్తుతం అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యవహారం ఇలాగే ఉంది. ధర ఎక్కువ అన్న పాపానికి నోటికి వచ్చినట్లుగా మాట్లాడ్డం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మగాళ్లను పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఆడాళ్లను పాచి పని చేసుకోవాలంటూ కించపరచడంపై మండిపడుతున్నారు. ఇంత కాలం ఆమె తన వ్యాపారాన్ని ఏ నెటిజన్స్ మీద ఆధారపడి నిర్వహించిందో, ఇప్పుడు అదే కస్టమర్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అసలు ఏం జరిగిందో అలేఖ్య అక్క సుమ, చెల్లి రమ్య వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు లైట్ తీసుకుంటున్నారు. వాళ్లు చెప్పే మాటల్లో పసలేదని కొట్టి పారేస్తున్నారు.ఇక అలేఖ్య తన పచ్చళ్ల వ్యాపారాన్ని విస్తరించుకునేందుక చీప్ ట్రిక్స్ ప్లే చేసిందనే విమర్శలు ఉన్నాయి. అదేదో మహేష్ బాబు సినిమాలో తమన్నా ఫ్యామిలీ అమ్మే స్వీట్స్ తింటే లోకంలో లేని లాభాలు కలిగినట్లు.. అలేఖ్య పికెల్స్ తిన్న వారికి ఏకంగా ప్రెగ్నెన్సీలు రావడం, పెళ్లిళ్లు కుదరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తన బిజినెస్ ను పెంచుకునేందుకు కొంత మందికి డబ్బులు ఇచ్చి ఫేక్ కామెంట్స్ పెట్టించుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రెండు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. “మీ రొయ్యల పచ్చడి తిన నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పికెల్ వారికి ధన్యవాదాలు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనికి అలేఖ్య సిస్టర్ రమ్య “రియల్లీ?? కంగ్రాట్స్, సో హ్యాపీ ఫర్ యు” అంటూ రిప్లై ఇచ్చింది. అటు మరో కస్టమర్ “మీ పికెల్ తిన్న వెంటనే మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయ్యింది మేడం. అందరూ అలేఖ్య చికెన్ పికెల్స్ కొనండి” అని కామెంట్ పెట్టింది. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ఇక ఈ కామెంట్స్ ను చూసి నెటిజన్లు, మీమర్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెట్టారు. వారి కామెంట్స్ ను షేర్ చేస్తూ.. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే, మరికొంత మంది వెకిలిగా కామెంట్స్ చేస్తున్నారు. “రొయ్య పచ్చడి తింటే ప్రెగ్నెన్సీ వచ్చిందా? అంటే రొయ్య కడుపు చేసిందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. “రొయ్య పచ్చడి తిని గర్భం వచ్చిందంటే.. తొమ్మిది నెలల తర్వాత రొయ్య పుడుతుందేమో?” అని మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “మీద దగ్గర మ్యాటర్ లేకపోయినా, మీ భార్య ప్రెగ్నెంట్ కావాలంటే.. ఆలేఖ్య చిట్టి పికెల్స్ నుంచి రొయ్యల పచ్చడి ఆర్డర్ పెడితే సరిపోతుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అటు అలేఖ్య చిట్టి పికెల్స్ చికెన్ పచ్చడి తిన్న వెంటనే తన చెల్లికి పెళ్లి ఫిక్స్ అయ్యిందన్న కామెంట్ పైనా నెటిజన్లు జోరుగా ట్రోల్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే
మనం పడే కష్టం.. చిన్న తప్పుతో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రస్తుతం అలేఖ్య పికిల్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆమె తన నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడింది. సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోంది. అయితే, సోషల్ మీడియా మనల్ని ఎంత పైకి ఎత్తుతుందో.. అంతే త్వరగా మనల్ని కింద పడేస్తుంది. పొగిడిన వాళ్లే తిట్టే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన అలేఖ్య.. తన ఆగ్రహాన్ని.. నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లిస్తోంది. చివరికి తన వ్యాపారాన్ని మూసేయాల్సిన పరిస్థితికి వచ్చింది.కస్టమర్‌పై ఆమె బూతులతో నోరుపాడేసుకోవడం వల్ల.. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే అలేఖ్య అక్క సుమి (సుమ) ఆ బూతులు తిట్టింది తాను కాదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా అలేఖ్య చెల్లి రమ్య కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ బూతులు తిట్టింది తన అక్క అలేఖ్య అని చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఆమె ఈ వీడియోలో ఏం చెప్పిందంటే..?అసలు ఏం జరిగిందో తెలియకుండా చాలా మంది సోషల్ మీడియాలో తమను తిడుతున్నారని రమ్య ఆవేదన వ్యక్తం చేసింది.“అలేఖ్య చిట్టీ పికెల్స్ ఆడియో బయటకు వచ్చింది. చాలా కాంట్రవర్సీ అవుతోంది. న్యూస్ ఛానెల్స్ లో, మీమర్స్ బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల అంత దారుణంగా బూతులు ఎలా తిడుతుంది? అని చాలా మంది అంటున్నారు. దానికి కారణం ఏంటని ఎవరూ ఆలోచించడం లేదు. వన్ సైడ్ గా ఆలోచించి జడ్జ్ చేస్తున్నారు. మాకు రోజు వందల కొద్దీ మెసేజ్ లు చాలా బ్యాడ్ గా వస్తున్నాయి. చాలా మంది పచ్చి బూతులు తిడతారు. వాటిని డిలీట్ చేస్తాం. కొంత మందిని బ్లాక్ చేస్తాం. కానీ, ఆడియో విషయంలో పొరపాటు జరిగింది. మా అక్కను తిట్టిన వ్యక్తికి పెట్టాల్సిన మెసేజ్ పొరపాటు వేరే అబ్బాయికి పెట్టింది. దాన్ని వెంటనే డిలీట్ చేసింది. కానీ, అతడు దాన్ని తనకే పంపించారు అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాం. కానీ, మా వాట్సాప్ కు 35 వేల మందికి పైగా రిపోర్టు కొట్టారు. వాట్సాప్ ఓపెన్ కాలేదు. అందుకే స్పందించలేకపోయాం. మేం బ్యాడ్ మెసేజ్ చేసిన వ్యక్తికి సారీ చెప్పాం. అతడికి, అతడి కుటుంబ సభ్యులకు కూడా క్షమించమని అడిగాం. పొరపాటుగా మెసేజ్ పెట్టడం వల్లే ఈ వివాదం చెలరేగింది” అని చెప్పుకొచ్చింది.ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో నెగెటివిటీ ఎదుర్కొన్నట్లు రమ్య చెప్పుకొచ్చింది. “చాలా మంది పర్సనల్ గా బూతులతో అటాక్ చేశారు. వారి మీద కేసులు పెట్టాలి అనుకున్నాం. కానీ, యువకుల జీవితాలను ఇబ్బందుల్లో పెట్టకూడదని కేసులు పెట్టలేదు. మమ్మల్ని మరీ దారుణంగా తిట్టే వాళ్లను చాలా మందిని బ్లాక్ చేశాం. మరీ కోపం కలిగిస్తే ఎవరైనా తిడతారు. మా అక్క కూడా అలాగే తిట్టింది. మేం ముగ్గురం అమ్మాయిలం. మాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా కొంత మంది బూతులు తిట్టారు. మా అమ్మానాన్నలను తిడితే తట్టుకోలేకపోయాం. ఎవరైతే మా అక్కను టార్గెట్ చేసి తిట్టారో, వారిని మాత్రమే తను తిట్టింది. అమాయకులు ఎవరినీ తిట్టలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి” అని రమ్య చెప్పుకొచ్చింది.