
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి వారు పక్ష ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఉగాది నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. ఈ ఉత్సవములు మొదటిగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని , రెండోది . సప్తమి నుండి పూర్ణిమ వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అని ఈ రెండు కలిపి ఈ వసంత పక్ష ఉత్సవాలుగా ఈ భద్రాచల క్షేత్రంలో చేయడం అనేది సంప్రదాయం ...
బ్రహ్మోత్సవాలలో బాగంగా గరుడ పట ఆవిష్కరణ,, అగ్నిమధానం, హోమాలు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ జరిగి ఆ గరుత్మంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం సంతానం లేని వారికి ఇస్తే గర్భదోషాలు పోతాయి అని నమ్మకం.
కళ్యాణ క్రతువులో భాగంగా శనివారం సాయింత్రం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి ఆదివారం ఉదయం సీతారామచంద్ర. స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు.