YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరల్డ్ బ్లడ్ డోనర్ డే ర్యాలీని ప్రారంభించిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

వరల్డ్ బ్లడ్ డోనర్ డే ర్యాలీని ప్రారంభించిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
అన్ని దానాల్లోకి అవయవ దానం గొప్పది అందులో రక్తదానం మరీ గొప్పది. ఎమర్జెన్సీలో ఉన్న వాళ్లకు రక్తం దానం చేయడం వల్ల  ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం సందర్బంగా అయన నిజాం కాలేజీలో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఒకరు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. పైగా మరింత ఆరోగ్యం గా తయారు అవుతారని అన్నారు. 4 లక్షల యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుండగా, 60 శాతం మాత్రమే డోనర్స్ ద్వారా వస్తున్నది. మిగతా 40 శాతం కూడా డోనర్స్ ద్వారా రక్తం అందే విధంగా చర్యలు చేపట్టాలి. రక్తదానం మీద విస్తృతంగా ప్రచారం జరగాలని అన్నారు. వీలైనన్ని ఎక్కువ రక్తదానం శిబిరాలు పెట్టి రక్తదానాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు పుట్టిన రోజు, పెళ్లి రోజు... ఇలా ఎదో ఒక రోజున రక్తదానం చేయాలి. నేను నా ప్రతి పుట్టిన రోజున రక్తదాన శిబిరాలు నిర్వహించి నేను, మా కుటుంబ సభ్యులు రక్తదానం చేస్తున్నామని వెల్లడించారు. గత 15 ఏళ్లుగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నాను. ప్రజల్లో అవగాహన పెంచి చైతన్య పరచాలి. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో రక్త హీనత ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నది. 
గర్భిణీలు ఎక్కువగా రక్త హీనతతో బాధపడుతున్నారని అయన అన్నారు. గర్భిణీలలో రక్తహీనత నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. గర్భిణీలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నాం. రక్తహీనత ఉన్న గర్భిణీ లకు ప్రసవ సమయాల్లో రక్తం అవసరం అవుతున్నది. కేసీఆర్ కిట్స్ పథకం వచ్చాక ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లోనే అవుతున్నాయని వివరించారు. రక్తదానాన్ని ప్రోత్సహిస్తే, ప్రసవ సమయాల్లో తల్లుల మరణాలను తగించవచ్చు. అలాగే అవయవదానం ని కూడా ప్రోత్సహించాలి. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్స్ సహా, ఐ బ్యాంక్స్ ని పెడుతున్నామని అన్నారు. నిన్ననే సరోజని ఐ హాస్పిటల్లో దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఐ బ్యాంకు ని ప్రారంభించాం. అవయవ దానాల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రక్తదానం చేద్దాం...అవరమైన వాళ్ళ ప్రాణాలను కాపాడుదామని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బెలూన్లని గాల్లోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రీతి మీనా, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts