YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం

ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 5, 
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి మార్చి 31 తేదీ వరకే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగింపు ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత నిర్ధారించడంతో పాటు అనర్హులకు కార్డుల ఏరువేతపై కేంద్రం ఫోకస్ చేస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డుదారులకు పలు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉచిత బియ్యం అందిస్తున్నాయని తెలిసిందే. మార్చి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వర్లు ప్రాబ్లమ్ ఉండటం, లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సంక్షేమం దూరం కావొద్దని భావించి కేంద్రం ఏప్రిల్ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ  పూర్తి చేసుకునేందుకు గతంలో పలుమార్లు గడువు పొడిగించింది. ఇటీవల ఏప్రిల్ 30 తేదీ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. ఈకేవైసీ ప్రక్రియ కోసం డెడ్ లైన్ పొడిగించడం ఇది నాలుగోసారి అని, ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి ఇక భవిష్యత్తులోకి గడువు పొడిగింపు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత కోసం, అక్రమాలు అరికట్టేందుకు చేసే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లబ్ధిదారుల నిర్లక్ష్యమని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 30 తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రయోజనాలు పొందనున్నారు. తరువాత ఈకేవైసీ పూర్తి చేసుకోని రేషన్ కార్డు దారులకు బియ్యం, సహా రేషన్ సరుకులు అందించరు. అలాంటి రేషన్‌కార్డులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్లను సంప్రదించి పూర్తి చేయవచ్చు. గడువు ముగుస్తుందని మార్చి నెలాఖరులో రేషన్ షాపులకు క్యూ కట్టడం, ఆన్ లైన్ పోర్టల్ లో ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం మరో నెలల రోజులు ఈకేవైసీ గడువు పొడిగించింది. రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లను సంప్రదించి e-KYC ప్రక్రియను సులభంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వీలు చూసుకుని, సాధ్యమైనంత త్వరగా రేషన్‌కార్డు దారులు ఈకేవైసీ పూర్తి చేసుకుని కార్డు రద్దు అవకుండా, లేక రేషన్ సరుకులు నిలుపుదల చేయకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా చేసుకుని లబ్ధిదారులు కేంద్రం, రాష్ట్రం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని సూచించారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి సన్న బియ్యం అందిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారని తెలిసిందే. కొత్త రేషన్ కార్డులకు సైతం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అప్లికేషన్లు పరిశీలించి జారీ చేస్తూనే ఉంటామన్నారు. రెండు రకాలుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. ఇదివరకే ఉన్న వారి కార్డులను సైతం అప్ డేట్ చేసి ఏటీఎం, పాన్ కార్డు తరహాలో ఉండే కార్డులను అందజేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.

Related Posts