YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బనకచర్లపై సుప్రీంకు టీ సర్కార్

బనకచర్లపై సుప్రీంకు టీ సర్కార్

హైదరాబాద్, ఏప్రిల్ 5,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు గరం గరం అవుతోంది. ఆ రాష్ట్రంలో నిర్మించనున్న ప్రాజెక్టులపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. దీనిపై స్టాండింగ్ కమిటీ, ఏజీతో నీటిపారుదల శాఖ మంత్రి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ కీలక నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి నీటి కొరత లేని ఆంధ్రప్రదేశ్ చూడాలని సీఎం చంద్రబాబు కలలుకంటున్నారు. ఈ ఆలోచనలపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. నిబంధనలు పాటించుకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఫుల్ ఫైర్‌ అవుతోంది. దీన్ని నిలువరించేందుకు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సిద్దమవుతోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్,బనకచర్ల ప్రాజెక్టు రూల్స్‌ను అతిక్రమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు, ఏజీ, స్టాండింగ్ కమిటీతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ నీటిని అక్రమంగా వాడుకోవడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసేలా బనకచర్ల ప్రాజెక్టు ఏపీ రూపొందిస్తోందని ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని బొల్లపల్లి రిజర్వాయర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సీమకు తరలిస్తారని వెల్లడించారు. కేంద్ర జల వనరుల సంఘం, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇది 1980లో జీడబ్ల్యూడీటీ ట్రైబ్యునల్ ఉత్తర్వులు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాలను అతిక్రమించినట్టేనని అభిప్రాయపడ్డారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే తాము చేసిన విజ్ఞప్తిని కేంద్రం స్పందించిందని ఉత్తమ్ వెల్లడించారు. పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. తమ పోరాట ఫలితంగానే ఆ ప్రాజెక్టును ముందున్న స్థితికి తీసుకురావాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు విషయంలో ఇంత జరిగినా ఆంధ్రప్రదేశ్‌ వెనక్కి తగ్గడం లేదని అందుకే కోర్టుకు వెళ్లబోతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల భద్రచలం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తమ్‌. అందుకే వాటిని ఎన్ని పోరాటాలు చేసైనా అడ్డుకుంటామన్నారు. గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ వీటిని సరిగా డీల్ చేయలేదని ఆరోపించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేశాయని అన్నారు. ఇకపై అలా జరగదని స్పష్టం చేశారు.  

Related Posts