YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆరుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం

ఆరుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం

సికింద్రాబాద్
బోయిన్ పల్లి ఠాణా పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. న్యూ బోయిన్ పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు తమ ముగ్గురు పిల్లలతో  పాటు సంధ్య అనే మరొక కుటుంబ సభ్యురాలు కూడా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహేష్ బోయిన్పల్లి లో నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బిక్షపతి సోదరి ఉమా వాళ్ళ ఇంటికి నిన్న ఉదయం వెళ్ళింది. మహేష్ ఉమా దంపతులు తమ పిల్లలైన రిషి, చైతు, శివన్ లతో పాటు సంధ్యను కూడా తమతోపాటు బయటకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆరు మంది కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినట్లు ఇంటి యజమాని ఫిర్యాదుదారుడు బిక్షపతి కి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒకేసారి ఆరు మంది కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు వెళ్లి ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుండి ఇమ్లీబన్ బస్ స్టాప్ వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇమ్లీబన్ బస్ స్టాప్ నుండి ఈ ఆరు మంది ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా ఆరు మంది కుటుంబ సభ్యుల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Posts