
హైదరాబాద్
సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ శ్రీ రామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసాడు. పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్ను నేసాడు. చీరపై 'శ్రీరామ రామ రామేతి..' శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేసాడు. ఒక గ్రాము గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు విజ్ఞప్తి చేసాడు.