
మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానంపర్చడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఐజి వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్ట్ చెప్పడం అనంతరం తాను ఎలాంటి వీడియోలు విడుదల చేయలేదని ఐజి స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంతు తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని హెచ్సీయూ భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని సందర్భాలలో తన పేరుని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై కే ఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధ్యక్ష పోస్టును నేనే పికించానని హెచ్చరించారు. కలిసి పని చేద్దాం రాష్ట్రంలో అభివృద్ధిని చేద్దామని బండి సంజయ్ కు సూచించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఓటుకు నోటు కేసులో ఏ 1, ఏ2 లను అరెస్టు చేయిస్తానని అన్నారు