YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మామిడి రైతులపై ట్రంప్ ఎఫెక్ట్

మామిడి రైతులపై ట్రంప్ ఎఫెక్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 9,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ సహా అనేక దేశాలపై అదనపు సుంకాలు విధించడంతో పలు రంగాలు నష్టాలను చవిచూస్తున్నాయి. భారత్‌పై ట్రంప్ 26 శాతం సుంకాలు విధించడంతో మనదేశంలోని పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది.ఆక్వా రంగంలో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏపీలో రొయ్యల ధర అమాంతం పడిపోయింది. ఇప్పుడు ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం మన దేశ మామిడి పండ్లపై కూడా పడుతోంది. భారత్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వాటి ఉత్పత్తిలో ముందు వరసలో ఉన్నాయి.ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 7,64,500 ఎకరాల్లో సాగవుతోంది. వాటిల్లో ప్రతి ఏడాది 24,45,900 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వస్తోంది. భారత్‌ నుంచి అమెరికాకు ప్రతి ఏడాది 45 వేల టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే 10 – 15 వేల టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి.వాటి విలువ రూ.150 – రూ.230 కోట్ల మధ్య ఉంటుంది. టారిఫ్‌ల పెంపుతో వాటి విలువ ఇప్పుడు మరో రూ.50 కోట్లకు పైగా పెరగవచ్చు. దీంతో అమెరికాలో భారత మామిడి పండ్ల ధరలు పెరిగి, డిమాండ్‌ తగ్గే ముప్పు ఉంటుంది.గతంలో అమెరికాకు మామిడి ఎగుమతులపై టారిఫ్ 0 – 5 శాతం మధ్య కొనసాగింది. ఇప్పుడు దాన్ని 22 శాతం నుంచి 26 శాతం వరకు పెంచారు. ట్రంప్‌ టారిఫ్‌లతో అమెరికాకు మనమామిడి పండ్ల ఎగుమతి ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు ఆ లాభాలు అందే అవకాశాలు అంతంత మాత్రమే.ఎందుకంటే ఎగుమతిదారులు టారిఫ్‌ల భారాన్ని రైతులపై వేయవచ్చు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవచ్చు. అమెరికాకు ఈక్వెడార్‌తో పాటు ఇండొనేషియా తక్కువ ధరకు మామిడిని ఎగుమతి చేస్తే మన దేశ రైతులు యూఎస్‌లో మార్కెట్‌ను కోల్పోయే అవకాశం ఉంది.

Related Posts