
ఛత్తీస్-ఘడ్
బీజాపూర్ జిల్లా ఏఎస్పి చంద్రకాంత్, పోలీస్ అధికారుల ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.లొంగిపోయిన మావోయిస్టులపై 26 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు చంద్రకాంత్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వారంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలు ప్రత్యక్షంగా పాల్గొనట్లు పోలీసులు తెలిపారు.