
దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు షాద్ నగర్ లో రోడ్డెక్కారు. షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ ముఖ్య కూడలిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగమణి, కాంగ్రెస్ గిరిజన నేత రఘు నాయక్, చెన్నయ్యలు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి వర్గాలపై సిలిండర్ ధరను రూ.50 పెంచి భారం మోపడం సరైంది కాదన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, నేతలు రఘు నాయక్, అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, గూడ వీరేశం, అమేర్, విజయ్ కుమార్ రెడ్డి, వీరేశం, జృమద్ ఖాన్, అందే మోహన్ ముదిరాజ్, మదన్ మోహన్ రెడ్డి, అన్వర్, సందీప్ గౌడ్, నాగమణి, కృషావేణి, వర్ష గౌడ్, ముబారక్ అలీ ఖాన్,ఖదీర్, శ్రీధర్, రవితేజ, అర్జున్ లక్ష్మన్, అనిల్ సత్తయ్య, చంద్రశేఖర్ అప్ప, ప్రదీప్, మధు, నీళ్ల రవీందర్ గౌడ్, సత్తయ్య, సాయి, జగదీశ్, కరుణాకర్, నక్క బలరాజ్, దిలీప్,వాసు,వంశీ గౌడ్,,తదితరులు పాల్గొన్నారు.