
రంగారెడ్డి
బుధవారం నాడు నటుడు మోహన్ బాబు ఇంటికి అయన కుమారుడు మంచు మనోజ్ వెళ్లారు. పోలీసులు మోహన్బాబు ఇంటికి ఎవరినీ అనుమతించడంలేదు. అందరిని రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్నారు. పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేపారు. తన కారు, విలువైన వస్తువులను దొంగలించారంటూ మంగళవారం నాడు మనోజ్ నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేసారు.
తండ్రి మోహన్బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం చేసారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు.