
విజయవాడ
మంగళవారం అనంతపూర్ జిల్లా లో మాజీ సీఎం వై ఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రం గా ఖండిస్తున్నామని పోలిస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గా వున్నా మిరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కేవలం ఇది రాజకీయ మైలేజీ కొరకు జగన్ ఉగిపోతున్నట్టు అనిపిస్తుంది. పోలీస్ డ్రెస్ ఒక ఉక్కు కవచం లాంటిది రాజ్యాంగ హక్కును కాపాడేది. పోలీస్ ఉద్యోగం చేయడం సామాన్య విషయం కాదు. మిరే ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎక్కడనుండి వస్తాయి. తీవ్ర ఒత్తిడికి గురై వారానికి ఒక పోలీస్ మరణిస్తున్నారని అన్నారు.
పోలీస్ బట్టలు ఉడదీసి ఏమి చూద్దామని, జగన్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కచ్చితం గా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం . శాంతిభద్రతల వైఫల్యం అనే విమర్శలు అర్ధరహితం. పోలిసులు అంటే ప్రజా రక్షణకు ఉక్కు కవచం. పోలీసులను బట్టలుడదీస్తాం అనడం ఎంత వరకు సమంజసం. 1200 నుంచి 1300కి ఒక పోలీస్ ఉన్నారు. పని ఒత్తిడీతో వారానికి ఒక పోలీసు మరణిస్తున్నారు. ఏమి చూడాలని పోలీస్ బట్టలు ఉడదీయలని అంటున్నారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు.. కించపరిచి మాట్లాడకండని అన్నారు.
సంఘం నేత భవాని మాట్లాడుతూ పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. బట్టలు ఉడదిస్తానని అనడం కరెక్ట్ కాదు. ఐదు వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు.. జగన్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.