
రంగారెడ్డి
ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళాను.. అదేరోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు. ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చొల్లను చేస్తున్నారని నటుడు మంచి మనోజ్ అన్నారు. మాది ఆస్తి గొడవ కాదు. స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ ఇది. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండడం లేదు కదా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు.. ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా ఒక్క ఛార్జ్ షిట్ ఫైల్ చేయలేదు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్. అన్ని ఆధారాలు ఉన్నా కూడా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదని అన్నారు.
నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడు. రాచకొండ కమిషనర్ బైండోవర్ ను కూడా మంచు విష్ణు క్రాస్ చేశారు. మనోజ్ తప్పు అని చెప్పడానికి విష్ణు దగ్గర ఒక్క ఆధారం చూపండి. నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు రోడ్డు మీదకు తీసుకుని వచ్చి వదిలారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్న అని నాపై కోపం. కూర్చుని మాట్లాడతాం అని అడుగుతున్న.. విష్ణు ముందుకు రావడం లేదు. హైకోర్టు నుండి జల్పల్లి నివాసంలో ఉండటానికి నాకు ఆదేశాలు ఉన్నాయి. కోర్టును తప్పుదోవ పట్టించి కింది కోర్టులో తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చారు. తిరిగి నేను కోర్టును ఆశ్రయించడంతో కిందికోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది . జలపల్లి ఇంట్లోకి వెళ్లడానికి నాకు అన్ని అనుమతులు ఉన్న పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. నా కుటుంబం నుండి ఒక రూపాయి తీసుకోలేదు. విష్ణు కెరియర్ కోసం అమ్మాయి గెటప్ వేసాను. నా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కాళ్ళు పట్టుకుంటా ఆన్న కూడా పోలీసుల కనికరించలేదు. సీఎం డిప్యూటీ సీఎంలను అడుగుతున్నా నాకు న్యాయం చేయమని . పహాడీ షరీఫ్ పోలీసులు నన్ను ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదో రాతపూర్వకంగా ఇస్తే కోర్టుకు చెప్పుకుంటా. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి అన్నది అతని లక్ష్యం. క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాలు విష్ణు దొంగతనాల గురించి ప్రశ్నించినందుకు నాపై కోపం. నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారని అన్నారు.