YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీ4 పధకంతో కుటుంబాల దత్తత

పీ4 పధకంతో కుటుంబాల దత్తత

విజయవాడ, ఏప్రిల్ 10, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా థింక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకుంటారు. వారు అనేక రకాలుగా ఆలోచించి ఇటు ఓటు బ్యాంకు పెరిగి రాజకీయంగా పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా చంద్రబాబు పాలనకు మంచి మార్కులు జనంలో పడేలా అన్ని రకాలుగా ఆలోచించి తగిన పథకాలను రూపొందిస్తారు. థింక్ ట్యాంక్ రూపొందించిన వాటిలో వర్క్ అవుట్ అయ్యేవి మాత్రమే చంద్రబాబు అందిపుచ్చుకుంటారు. అందులో నుంచి ఈ ఏడాది వచ్చిందే పీ4 పథకం. పేదరిక నిర్మూలన కోసం ఈ పథకాన్ని తెచ్చారు. సంపన్నులు పది శాతం ఉంటే పేదరికం ఎక్కువ శాతం ఉంది కాబట్టి వారిని ఆదుకునేందుక ఈ పథకాన్ని తెచ్చారు.మొన్న ఉగాది నాడు పీ4 పథకాన్ని చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రారంభించారు. అయితే ఆశించిన రీతిలో ఇప్పటి వరకూ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో చంద్రబాబు పీ4 పథకానికి సంపన్నులు ఆకట్టుకునేలా చర్యలు తీసుకునేందుకు ప్రజాప్రతినిధులతో పాటు తనకు సుదీర్ఘకాలం నుంచి సహకారం అందిస్తూ వస్తున్న పారిశ్రామిక వేత్తలకు అప్పగించారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి కనీసం ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా సంపన్నులు నేరుగా పేదలను ఆదుకునేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.నియోజకవర్గాల వారిలో ప్రధానంగా సంపన్నులను గురించి పీ4 పథకానికి సాయం అందించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ వంతుగా ప్రయత్నం చేయాలని కోరారు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. వచ్చే ఉగాది పండగ నాటికి ఎంత మేర బంగారు కుటుంబాలకు లబ్ది జరిగింది? సంపన్నుల పేర్లతో పాటు పారదర్శకంగా వివరాలను వెల్లడించి ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా అవసరమైన చర్యలు సత్వరం ప్రారంభించాలని గట్టిగా కోరారు. ఒక పథకం విజయవంతం కావాలంటే తొలుత మనం శ్రమించాలని, తర్వాత పథకం దానంతట అదే విస్తృతంగా డెవెలెప్ అవుతుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.ముఖ్యంగా పేదరికంలో మగ్గుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని బంగారు కుటుంబాల కింద ఎంపిక చేస్తే వారు కూడా పార్టీ జెండా దించకుండా మరింతగా రాజకీయంగా ఉపయోగపడతారని చంద్రబాబు వేస్తున్న అంచనాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు వచ్చే ఏడాది కూడా మరో కొత్త పథకంతో జనం ముందుకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు థింక్ ట్యాంక్ నాలుగైదు పథకాలకు రూపకల్పన చేసినట్లు సమాచారం. వాటిలో వర్క్ అవుట్ అయ్యేవి మాత్రమే కాకుండా ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజలు ఎక్కువ శాతం మంది లబ్ది పొందేలా మరొక కొత్త పథకాన్ని చంద్రబాబు తెచ్చేయోచనలో ఉన్నారు.

Related Posts