
యాదాద్రి..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులో గల దివిస్ కంపెనీ పక్కనే ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో దొంగలు బీభత్సం సృష్టించారు... ఏటీఎంలో ఉన్న సుమారు 12 లక్షల 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు.. దొంగతనం చేసిన తర్వాత ఏటీఎం షట్టర్ ను ఎవరికి అనుమానం రాకుండా కిందకు వేసి అక్కడి నుండి దొంగలు పరారయ్యారు.
ఘటన స్థలానికి వెంటనే యాదాద్రి జిల్లా డీసీపీ అక్షాన్ష్ యాదవ్, రాచకొండ క్రైం డీసీపీ బి అరవింద్, చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డిలు వారి సిబ్బందితో కలిసి క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరిస్తున్నారు.. సిసి కెమెరా ఫుటేజ్ లు కూడా సేకరించే పనిలో ఉన్నారు.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65 పక్కనే ఉన్న ఈ ఏటీఎం లో దొంగలు బీభత్సం సృష్టించి డబ్బులు ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాల్ గా మారిందని చెప్పవచ్చు....