YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ అత్యుత్సాహమే సెంట్రల్ వర్శిటీ చే జారిందా..

రేవంత్ అత్యుత్సాహమే సెంట్రల్ వర్శిటీ చే జారిందా..

హైదరాబాద్, ఏప్రిల్ 10, 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూవివాదం ఎట్టకేలకు కోర్టు జోక్యంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఎక్కడ తడబడింది. రేవంత్ అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలిలో సర్వేనెంబర్ 25లోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అంటూ, అక్కడ ఐటీ కంపెనీలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. వెంటనే హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు, ఆందోళనలతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. క్యాంపస్ లోపలే ఉంటూ ప్రతీ రోజూ ఆందోళనలు కొనసాగించారు. అలా మొదట్లో రోజులతరబడి విద్యార్థులు చేసిన ఆందోళనలు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే లైట్ తీసుకుంది.రోజుల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను తీరును తప్పుబడుతూ అసెంబ్లీలోనే విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు. యూనివర్సిటీ లోపల ఉన్నది గుంటనక్కలు అంటూ ఏకంగా సిఎం రేవంత్ రెడ్డి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విద్యార్థుల నిరసనలు, యూనివర్సిటీ లోపల పరిస్థితులు బయటకు రాకుండా మీడియాకు అనుమతి నిరాకరించారు. మీడియా కెమెరాకు నో ఎంట్రీ అంటూ అడ్డుకున్నారు. విద్యార్థులు గేటు లోపల, బయట మీడియా ఇలా హెచ్సీయూ భూముల్లో పనులు ఆపాలంటూ రోజుల తరబడి పోరాటం కొనసాగింది. సరిగ్గా వారం రోజుల క్రితం నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని భావించిన విద్యార్థులు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని  ప్రచారం ప్రారంభించారు. అది మొదలు యూనివర్సిటీ లోపల పరిస్థితులు ఒక్కొక్కటిగా వీడియో రూపంలో బయటకు లీక్ అవ్వడం మొదలైంది. లోపల చెట్లను ప్రొక్లేన్లతో రాత్రి వేళల్లో తొలిగిస్తుంటే, ఆ సమయంలో నెమళ్లు, నక్కలు, జింకలు ఇలా వణ్యప్రాణులు పెద్దగా అరవడం, ఆ అరుపులను వీడియో తీసిన విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆక్సిజన్ అందించే వందల చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలతో వణ్యప్రాణుల మనుగడనే ప్రశ్నార్దకంగా మార్చారు. సహజసిద్దమైన పీకాక్ లేక్ తవ్వి వింధ్వంస చేశారు. వేల సంవత్సరాల నాటి మష్రూమ్ రాక్‌ను మాయం చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్దమే చేశారు. విద్యార్థుల పోస్టులు, వీడియోలు అందరినీ కదలించాయి. సెలబ్రిటీలు సైతం ప్లీజ్ రేవంత్ రెడ్డి నిర్ణయం మార్చుకోండి అంటూ ఒక్కొక్కరుగా స్పందిస్తూ మీడియాకు వీడియోలు విడుల  చేశారు.హెచ్సీయూలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం జనం ముందు పెట్టాలనే టార్గెట్‌తో ముందుకెళ్లిన విద్యార్థులకు ఊహించని స్పందన లభించింది. ఆ వీడియో విద్యార్థుల ఆందోళనలకు కొత్త ఊపు తెచ్చింది. జింక, నెమళ్ల అరుపులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఓ వైపు భారీ బుల్డోజర్లతో లోపల చెట్లు నరుకుతుంటే, వాటిని వీడియోలు తీసి ప్రతీ రోజూ షోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లారు. పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ డిజిటల్ మీడియా ఉద్యమానికి తెరలేపారు హెచ్ సీయూ విద్యార్థులు.ఎప్పుడైతే సోషల్ మీడియాలో వరుస పోస్టులతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రచారం చేస్తున్నారో, ఆ ప్రభావం పీక్స్‌కు చేరుకుంది. య్యూట్యూబ్ ఛానెల్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ హెచ్సీయూ భూముల వివాదం, విద్యార్థులు నిరసనలపై ఫోకస్ చేయక తప్పలేదు. అలా అగ్గిరాజుకున్న టైంలో అసలు కథ మొదలైంది. ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టుల్లో పిటీషన్ వేయడంతో విచారణ జరిగింది. కోర్టులు సైతం లోపల వణ్యప్రాణుల మనుగడకు ఇబ్బందిని కలిగించే హక్కుమీకు లేదంటూ సీరియస్ అవ్వడం, మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంచ గౌచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదంలో వెనక్కు తగ్గక తప్పలేదు. వణ్యప్రాణుల రక్షణ, ప్రకృతి విధ్వంసం ఇలా ఈ ఒక్క పాయింట్‌తో ఏకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం సందిగ్ధంలో నెట్టేలా చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్చలతో పరిష్కారం కోసం ప్రయత్నించే పరిస్థితికి తీసుకొచ్చింది.

Related Posts