
అమరావతి
ఏ రాజకీయ నాయకుల చొరవతోను,ఏదొక వ్యవస్థ చొరవతోను పోలీసులు అవ్వరు. ఎంతో కష్ట తరమైన పరీక్షల్లో ఉత్తిర్ణులు అయ్యాక వారు ఆ అర్హత సాధిస్తారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శాంతి భద్రత లని కాపాడే బాధ్యతని వారి భుజాన వేసుకునేటువంటి నాలుగోవ సింహం గా పోలీస్ వ్యవస్థని ప్రతి ఒక్కరు గుర్తిస్తుంటారు. వారి ప్రాణాలని పెట్టి శాంతి భద్రతలని కాపాడటంలో ప్రధాన పాత్ర పోసిస్తారు. నాలుగోవ సింహం గా పరిగినించబడిన పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని అన్నారు.
సత్యసాయిజిల్లా ఎస్పీ ఒక మహిళ అని కూడా లేకుండా విచక్షణ కోల్పోయి జగన్ వ్యాఖ్యాణించటం సమంజసం కాదు. 5వేల మంది మహిళ పోలీస్ లు ఉన్నారనే విషయం జగన్ కి తెలుసా అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు కేవలం ఆ మహిళలనే కాదు ఆ వ్యవస్థలో పని చేసే ప్రతి ఒక్కరిని కించపరిచాయి. జగన్ మోహన్ రెడ్డి ఆ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు.