
విజయవాడ
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను హై కమాండ్ ఆదేశించింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్పై కేసు నమోదు చేసారు. గుంటూరులో కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరాడు.