
హైదరాబాద్
సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ గురువారం నాడు కంచె గచ్చిబౌలిలో క్షేత్రస్థాయి పర్యటించింది. హెచ్ సీయూ ఇష్యూపై ఈనెల 16 వరకు స్టే వున్న సంగతి తెలిసిందే. ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు కమిటీ వచ్చింది. గతరాత్రి ఢిల్లీ నుండి నగరానికి చేరుకున్న కమిటీతో కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ తో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హెచ్ సీయూకు కమిటీ చేరుకుంది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన,వాస్తవ పరిస్థితులపై కమిటీ ఆరా తీసింది.