
నల్గొండ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాబోయే రజతోత్సవ సభకు సమాయత్తమవుతున్నారు. వరంగల్లో ఈ నెల 27న జరగబోయే భారీ బహిరంగ సభ విజయవంతం కోసం నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ దిశానిర్దేశం చేశారు. హాలియా పట్టణ కేంద్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు మరియు రెండు మున్సిపాలిటీల ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, పార్టీ శ్రేణులకు రాబోయే సభ ప్రాముఖ్యతను వివరించారు.