YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాదాద్రి జిల్లా లో ఇస్రో పరికరాల తయారీ.

యాదాద్రి జిల్లా లో ఇస్రో పరికరాల తయారీ.

యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి  జీఎస్ఎల్వీ రాకెట్లో విని యోగించేందుకు అవసరమైన 'ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్లు బీబీనగర్ మండలం నుంచి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)కు తరలించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్ లో వీటిని వినియోగించనున్నారు. బీబీనగర్ మండలంలోని జెమ్మిలాపేట్ లోని వీఎన్డిసెల్ ప్లాస్ట్  కంపెనీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో వీఎ స్ఎస్సి డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ ప్లాగ్ ఆఫ్ చేశారు. తిరువనంతపురంలోని వీఎస్ఎస్సీ నుంచి శాస్త్రవేత్తలు డాక్టర్ ఏఎం. నల్ల పెరుమాల్, డాక్టర్ సురేష్ కుమార్ తోపాటు మొత్తం 13 మంది వర్చువల్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇస్రోతో ఒప్పందం మేరకు ఒక రాకెట్ కు వినియోగించనున్న 365 'ఏకో థెర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్లను కంటైనర్ల ద్వారా తరలించారు. ఈ సందర్భంగా వీఎన్డీ సెల్ స్టార్ట్ కంపెనీ డైరెక్టర్లు డి.చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.సుఖ్వన్ రెడ్డి, కే.ఎస్.చౌదరి పూజలు నిర్వహించారు.

Related Posts