YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్

ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్
 రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలపై కూడా ప్రధానితో చర్చిస్తారు. ఢిల్లీలో ఉన్న ఏపీభవన్ అంతా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దానిని తమకే ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి బదులుగా ఈ భూమిని కేటాయించిందని, ఈ ఆస్తి అంతా పూర్వ నిజాం ప్రభుత్వానిదేనని వివరించనున్నారు.రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలపై ప్రధానితో సీఎం చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసుచేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరుతారు. రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీచేసిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్రం పంపించిన విషయాన్ని మరోసారి ప్రధానికి గుర్తుచేస్తారు. రాష్ట్రాలకు చెందిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట ప్రభుత్వాలకే ఇవ్వాలని కూడా ప్రధానిని సీఎం కేసీఆర్ కోరే అవకాశం ఉన్నది.రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి పంట పెట్టుబడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.8 వేలు ఇస్తున్నదని, ఈ ఏడాది మొదటి పంట సాయం కింద ఇప్పటికే ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన విషయాన్ని ప్రధానికి వివరిస్తారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేస్తారని తెలిసింది.హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు, పన్నులలో వాటాపెంపు, ప్రాజెక్టులకు సహకారం, పెండింగ్‌బిల్లుల విడుదలతోపాటు రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై ఈ భేటీలో సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నది. ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం కూడా ఉన్నది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశానికి రావాలంటూ నీతిఆయోగ్ ఇప్పటికే ఆహ్వానించింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం

Related Posts